Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొత్త పథకం

  • ‘బిల్డ్ ఏపీ’ పేరుతో కొత్త కార్యక్రమం
  • ప్రభుత్వ భూముల గుర్తింపునకు నిర్ణయం
  • వివరాలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూములను గుర్తించి ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాలు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించింది. ‘బిల్డ్ ఏపీ’ అని ఈ పథకానికి పేరు పెట్టింది. బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమించింది. ఎన్ బీసీసీ సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది.

ఈ పథకంలో భాగంగా మొదట ప్రభుత్వ భూములు గుర్తించి భవన సముదాయాలు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలో ప్రభుత్వ భూముల వివరాలను సమర్పించాలని జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మిగతా భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపింది. వీటిని ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాక, ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను కూడా సేకరించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
Andhra Pradesh

More Telugu News