Nagarjuna Reddy: ఏపీ ఈఆర్ సీ ఛైర్మన్ గా జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం
- విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణస్వీకారోత్సవం
- గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం
- హాజరైన సీఎం జగన్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్ సీ) ఛైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాష్ట్ర మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం తర్వాత సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ కొత్త ఏపీ ఈఆర్ సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.