Narendra Modi: ఒకప్పుడు పేదరికాన్ని స్వయంగా అనుభవించాను: సౌదీలో మోదీ

  • పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదు
  • రైల్వే ప్లాట్ ఫాంపై టీ అమ్ముకున్నాను
  • పేదలకు సాధికారత లభించినప్పుడే పేదరికం అంతమవుతుంది
తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, బాల్యంలో పేదరికాన్ని అనుభవించానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. కొన్ని గంటల క్రితం రియాద్ లో ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు.

తాను  పేదరికం గురించి పుస్తకాల్లో చదవలేదని, దాన్ని స్వయంగా అనుభవించానని మోదీ చెప్పారు. ఒకప్పుడు తాను రైల్వే ప్లాట్ ఫాంపై టీ అమ్ముకున్నానని, ఇప్పుడు ఇక్కడిదాకా వచ్చానని వ్యాఖ్యానించారు. తాను గౌరవంగా బతికానని, తనకు పేదలంటే గౌరవమని మోదీ తెలిపారు. వారికి సాధికారత లభించినప్పుడే దేశంలో పేదరికం అంతమవుతుందని చెప్పారు. భారత్ లో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు ప్రతి ఒక్కరితో బ్యాంకు ఖాతాలు తెరిపించడం ద్వారా వారికి సాధికారత కల్పిస్తున్నామని వివరించారు. వీటి ద్వారా వారికి గౌరవం లభిస్తుందని వ్యాఖ్యానించారు.

Narendra Modi
BJP
India
Prime Minister

More Telugu News