New Delhi: ఢిల్లీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు... హై అలర్ట్ ప్రకటన

  • 48 గంటలపాటు హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
  • జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా 31న విభజన
  • విభజనను అడ్డుకోవడానికి ఉగ్ర సంస్థలు కుట్ర పన్నాయన్న నిఘా వర్గాలు
జమ్మూ కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించనున్ననేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 31న ఈ విభజన ప్రక్రియను కేంద్రం జరుపనుంది. ఈ క్రమంలో 48 గంటలపాటు భద్రతా దళాలను రాజధానిలో భారీ స్థాయిలో మోహరించనున్నారు. జమ్మూ కశ్మీర్ విభజనను నిలువరించేందుకు ఉగ్రవాద సంస్థలు దాడులకు కుట్ర పన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా దళాలు ఈ చర్యలు చేపట్టాయి.

దేశ రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ముఖ్యప్రదేశాల్లో దాడులు జరిగే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో, ఆయా ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా ఏర్పాట్లపై నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. జనసమ్మర్థ ప్రాంతాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతను పెంచారు.
New Delhi
India
Police

More Telugu News