Jagan: సిగ్గులేకుండా జాతీయ పతాకానికి కూడా వైసీపీ రంగులేస్తున్నారు: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
'శ్మశానాలను ఎలాగూ వదలడం లేదు కనీసం జాతీయ జెండాని అయినా గౌరవించండి వైఎస్ జగన్ గారూ' అంటే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. ఓ గ్రామ సచివాలయ గోడలకు త్రివర్ణ పతాకం రంగులు ఉండగా, వాటికి వైసీపీ రంగులు పూస్తున్న వీడియోను నారా లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

దీనిపై ఆయన వ్యాఖ్యానిస్తూ, వైసీపీ నేతల దేశభక్తి ఇలా ఉంటుందంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మన జాతీయ పతాకం పట్ల వైసీపీ నేతలకు ఎంత గౌరవం ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. సిగ్గులేకుండా జాతీయ పతాకానికి వైసీపీ రంగులు వేస్తున్నారంటే, ఆ తర్వాత జాతీయ పతాకం స్థానంలో వైసీపీ జెండా ఎగురవేస్తారేమోనని సెటైర్ వేశారు.
Go Back to Shorts
Jagan
Nara Lokesh
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News