Bangladesh: బంగ్లాదేశ్ టి20, టెస్టు జట్లకు కొత్త కెప్టెన్ల ప్రకటన

  • సీనియర్ ఆటగాడు షకీబల్ పై ఐసీసీ నిషేధం
  • టి20 జట్టు సారథిగా మహ్మదుల్లా
  • టెస్టు జట్టు పగ్గాలు మోమినుల్ హక్ కు అప్పగింత
బంగ్లాదేశ్ క్రికెట్ ను కొన్నిరోజులుగా అనూహ్య పరిణామాలు కుదిపేస్తున్నాయి. ఆటగాళ్ల సమ్మె వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందనుకునేంతలో స్టార్ ఆటగాడు షకీబల్ హసన్ పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. షకీబల్ బంగ్లాదేశ్ టి20, టెస్టు జట్లకు సారథ్యం వహిస్తుండడంతో ఇప్పుడతని స్థానంలో కొత్త కెప్టెన్లను ఎంపిక చేశారు. టి20 జట్టుకు సీనియర్ ఆల్ రౌండర్ మహ్మదుల్లా, టెస్టు జట్టుకు మోమినుల్ హక్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వెల్లడించింది.
Bangladesh
Cricket
BCB

More Telugu News