Santosh Ambeker: గ్యాంగ్ స్టర్ సంతోశ్ అంబేకర్ ఇంటి నుంచి కోట్లాది రూపాయల నగదు స్వాధీనం    

  • సంతోశ్ తో పాటు అతని అనుచరుల ఇళ్లపై దాడులు
  • రూ. 5.50 కోట్ల నగదు స్వాధీనం
  • పలు కార్లు, ద్విచక్ర వాహనాల సీజ్
సంతోశ్ అంబేకర్... మహారాష్ట్రలో పలు క్రిమినల్ కేసులు ఉన్న ఒక గ్యాంగ్ స్టర్. తాజాగా నాగపూర్ లో ఆయనతో పాటు, ఆయన అనుచరులకు సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించిన మహారాష్ట్ర పోలీసులు భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 5.50 కోట్లను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇంకా బీఎండబ్ల్యూతో పాటు పలు కార్లు, ద్విచక్రవాహనాలను కూడా సీజ్ చేశారు. గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను రూ. 5 కోట్ల విలువైన ఆస్తి ఒప్పందంలో మోసం చేసినట్టు సంతోశ్ పై ఎంసీఓసీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసంపై పోలీసులు దాడులు జరిపారు.
Santosh Ambeker
Gangster
Maharashtra

More Telugu News