Somarapu Satyanarayana: ప్రజలు వద్దంటున్నా.. ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటు చేస్తారా?: బీజేపీ నేత సోమారపు సత్యనారాయణ ఆగ్రహం

  • తెలంగాణను బొందల గడ్డగా మార్చేందుకు  ప్రయత్నం 
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తుల రాస్తారోకో 
  • టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాభీష్టానికి భిన్నంగా పాలిస్తోంది
మంచిర్యాల జిల్లాలోని ఇందారంలో ప్రజలు వద్దంటున్నా ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుకు పూనుకోవడం తగదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఈరోజు గ్రామస్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటును అంగీకరించేదిలేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. గ్రామస్తుల ఆందోళనలో పాలుపంచుకున్న బీజేపీ నేత సత్యనారాయణ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాభీష్టానికి భిన్నంగా పాలన చేస్తుందన్నారు. తెలంగాణను బొందల గడ్డగా మార్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇందారంలో ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటును ఆపేయాలని డిమాండ్ చేశారు.
Somarapu Satyanarayana
BJP
TRS

More Telugu News