dravid: ద్రవిడ్‌తో సమావేశం కానున్న గంగూలీ

  • భారత్ తో డే అండ్‌ నైట్‌ టెస్టు కోసం బంగ్లాదేశ్ ను ఒప్పించిన గంగూలీ
  • ఈ విషయంపై ద్రవిడ్ తో చర్చించే అవకాశం
  • ఎన్‌సీఏలోని సమస్యలపై కూడా చర్చలు
నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) చీఫ్ రాహుల్‌ ద్రవిడ్‌తో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రేపు సమావేశం కానున్నారు. భారత్ తో డే అండ్‌ నైట్‌ టెస్టు కోసం గంగూలీ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డును ఒప్పించడానికి గంగూలీ చేసిన ప్రయత్నాలు దాదాపు సఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో ద్రవిడ్‌తో ఆయన చర్చించనున్నారు. ఆయనతో చర్చించి టీమిండియా రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయబోతున్నారు.

ఆయన ఇచ్చే సలహాల ఆధారంగా ఒక ప్రణాళిక రూపొందించాలని గంగూలీ భావిస్తున్నారు. అలాగే, ఎన్‌సీఏలో ఉన్న సమస్యలపై కూడా గంగూలీ తెలుసుకోనున్నారు. ఈ సమావేశంలో ఎన్‌సీఏ సీఈఓ తుఫాన్‌ గోష్‌ కూడా పాల్గొంటారు. ఈ ఏడాది జులైలో ద్రవిడ్ ఎన్‌సీఏ హెడ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే.
dravid
Sourav Ganguly
Cricket

More Telugu News