Share Chat: షేర్ చాట్ లో పరిచయమైన అమ్మాయి కోసం... అనంతపురం టూ విజయవాడ... అడ్డంగా బుక్కయ్యాడు!

షార్ట్స్‌లో చూడండి
తనకు షేర్ చాట్ లో పరిచయమైన అమ్మాయి కోసం ఆశగా, అనంతపురం నుంచి విజయవాడకు వచ్చిన ఓ అబ్బాయి, వారి కుటుంబీకులకు దొరికిపోయాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన ఎం విజయ్ కుమార్ అనే యువకుడికి, రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక (15) పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్ చేసుకునే వారు.

ఈ క్రమంలో ఆ బాలిక, యువకుడితో మాట్లాడుతూ, తనను ఇంట్లో నుంచి తీసుకుని వెళ్లకుంటే చనిపోతానని చెప్పింది. దీంతో విజయ్ కుమార్ తన సోదరుడు నవీన్ తో కలిసి నిన్న విజయవాడకు వచ్చారు. ఓ హోటల్ లో దిగారు. ఈ విషయాన్ని బాలికకు చెప్పారు. ఈలోగా విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు, హోటల్ కు వెళ్లి యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.

కాగా, తాను ఆ అమ్మాయి మైనర్ అనుకోలేదని, డిగ్రీ చదివినట్టు తాను చెప్పిందని, అందువల్లే వచ్చానని విజయ్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. మొత్తం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Share Chat
Minor
Lover
Vijayawada
Police

More Telugu News