Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • రీమిక్స్ పాటతో వచ్చిన రకుల్ 
  • మహేశ్ ఫ్యామిలీకి భారీ పారితోషికం 
  • ఆర్.ఎఫ్.సిలో 'ఆర్.ఆర్.ఆర్' షూటింగు 
*  అందాల నాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ రీమిక్స్ పాటతో అదరగొడుతోంది. మిలాప్ జవేరి దర్శకత్వంలో ప్రస్తుతం ఆమె 'మార్జావాన్' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఇందులో నాటి హిట్ సాంగ్ 'హయ్యా .. హో'ను ఆమెపై రీమిక్స్ చేశారు. ఈ పాటలో ఆమె అందచందాలు, డ్యాన్సులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట కోసం రకుల్ చాలా కష్టపడిందని దర్శకుడు కితాబునిస్తున్నాడు.
*  సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాల ద్వారానే కాకుండా వాణిజ్య ప్రకటనలలో నటించడం ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో ఈమధ్య తన కుటుంబ సభ్యులతో కలసి ఓ నిర్మాణ రంగ వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఇందుకు గాను వీరికి ఐదు కోట్ల పారితోషికం ముట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
*  ఎన్టీఆర్, చరణ్ కలసి నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ సెట్స్ లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లపై కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నారు.
Rakul
Bollywood
Mahesh Babu
NTR
Charan

More Telugu News