Ponnala Lakshmaiah: కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కారును ఢీ కొట్టిన మరో వాహనం.. తప్పిన ప్రమాదం!

  • జూబ్లీహిల్స్ 45 సిగ్నల్ వద్ద ఘటన
  • ఆగి ఉన్న కారును ఢీకొట్టిన సినిమా వాహనం
  • కారులో లక్ష్మయ్య, ఆయన మనవడు
కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45 సిగ్నల్ వద్ద ఆగివున్న ఆయన కారును, సినిమా షూటింగ్‌‌కు చెందిన వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పొన్నాల కారు ముందు భాగం ధ్వంసమైంది. ఆ సమయంలో కారులో పొన్నాలతోపాటు ఆయన మనవడు ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తర్వాత వారు మరో కారులో వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Ponnala Lakshmaiah
Hyderabad
car accident
Congress

More Telugu News