Dushyant: దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారంలో పొరబాటు

షార్ట్స్‌లో చూడండి
హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ, జననాయక్ జనతాపార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయగా, ఉపముఖ్యమంత్రిగా జన నాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారం చేశారు.  దుష్యంత్ ప్రమాణస్వీకారం చేస్తున్నపుడు హర్యానా రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అనడానికి బదులు, 'భారత్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి' అని తప్పుగా అన్నారు. దాంతో గవర్నర్ మరోసారి ఆయన చేత ప్రమాణం చేయించారు.  
Go Back to Shorts
Dushyant
Haryana

More Telugu News