Bigg Boss: బిగ్ బాస్-3 కంటెస్టెంట్ అలీ రెజా నా శిష్యుడే: కౌశల్

షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్ సెకండ్ సీజన్ విజేత కౌశల్ తాజా సీజన్ పై స్పందించారు. ఓ వీడియోలో మాట్లాడుతూ, బిగ్ బాస్-3లో టాప్ ఫైవ్ లోకి వెళ్లిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక, చివరి వారంలో అడుగుపెట్టిన కంటెస్టెంట్లలో ఒకరైన అలీ రెజా తన శిష్యుడేనని కౌశల్ వెల్లడించారు. అలీ రెజా టీనేజ్ లో ఉన్నప్పుడే తన వద్దకు వచ్చాడని, తానే మోడలింగ్ లో శిక్షణ ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. అప్పుడు అలీ రెజాకు 18 ఏళ్ల వయసుంటుందని తెలిపారు. ఫ్రెష్ గా తన వద్దకు వచ్చిన రెజాకు మేకోవర్ చేసింది, ఫస్ట్ ఫొటోషూట్ చేసింది తానేనని, మొదటి పారితోషికం ఇచ్చింది కూడా తానేనని కౌశల్ చెప్పారు. తన వద్ద శిష్యరికం చేసిన రెజా ఇప్పుడు బిగ్ బాస్ ఫైనల్లో ఉండడం సంతోషం కలిగించే విషయం అని అన్నారు.
Go Back to Shorts
Bigg Boss
Ali Reza
Kaushal Manda

More Telugu News