Vellampalli: చినజీయర్ తిరునక్షత్ర ఉత్సవాలలో ఏపీ మంత్రి వెల్లంపల్లి

షార్ట్స్‌లో చూడండి
త్రిదండి చిన జీయర్ స్వామి 64వ తిరునక్షత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగిన ఈ ఉత్సవాలకు ప్రముఖులు, భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చిన జీయర్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  

ఈ సందర్భంగా మంత్రికి చిన జీయర్ స్వామి మంగళశాసనాలు పలుకుతూ ఆశీర్వదించారు. జీయర్ స్వామి తొలుత జ్ఞాన దీపాన్ని వెలిగించి, భక్తులకు ఆశీస్సులు, తీర్థప్రసాదాలు, ఆచార్యుల అనుగ్రహం అందజేశారు. అంతకు ముందు తిరునక్షత్ర ఉత్సవాలను లక్ష్మీ పూజతో ప్రారంభించారు. సుప్రభాత సేవ కార్యక్రమానంతరం జీయర్ పురస్కారాలను పండితులకు అందజేశారు.
Go Back to Shorts
Vellampalli
Hyderabad
Andhra Pradesh
Telangana
KCR

More Telugu News