KCR: నాది బాల్య వివాహం... అప్పట్నుంచే భక్తి: కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ శివార్లలో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకలు నిర్వహించగా తెలంగాణ సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, భగవంతుడ్ని పూజించే సంస్కారం, ఆచారం తనకు తల్లిదండ్రుల నుంచే సంక్రమించిందని తెలిపారు. తామంతా జై శ్రీమన్నారాయణ నామస్మరణతో వైష్ణవ సంప్రదాయం అనుసరిస్తామని వివరించారు. తనది బాల్య వివాహం అని, పద్నాలుగో ఏటనే వరంగల్ జిల్లా చిత్తలూరులో పెళ్లయిందని కేసీఆర్ వెల్లడించారు.

తమ పెళ్లి ఓ ఆధ్యాత్మిక గురువు సమక్షంలోనే జరిగిందని తెలిపారు. అప్పట్లో ఆధ్యాత్మిక గురువులు తమ ఇంటికి వచ్చేవారిని, వారు నెల రోజుల పాటు తమ ఇంట ఉండి పురాణాలు, ఇతిహాసాలు వివరించేవారని గుర్తుచేసుకున్నారు. అప్పటినుంచే తనలో భక్తి పెంపొందిందని కేసీఆర్ పేర్కొన్నారు.
Go Back to Shorts
KCR
Hyderabad
Telangana
TRS

More Telugu News