BSNL: తెలుగు రాష్ట్రాల యూజర్ల కోసం కొత్త ప్లాన్ ను తీసుకువచ్చిన బీఎస్ఎన్ఎల్

  • 200 జీబీ డేటా ఆఫర్ చేస్తున్న బీఎస్ఎన్ఎల్
  • ధర రూ.689
  • 180 రోజుల కాలపరిమితి
భారత్ లో జియో రంగప్రవేశంతో డేటా వినియోగం భారీగా పెరిగింది. దాంతో ఇతర మొబైల్ సేవల ఆపరేటర్లు కూడా డేటా ప్లాన్లు సవరించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజాగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా డేటా ప్లాన్ వెలువరించింది. దీని ధర రూ.689 కాగా, 200 జీబీ డేటా ఆఫర్ చేస్తున్నారు. ఇది 180 రోజుల కాలపరిమితి కలిగిన ప్లాన్. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. ఇందులో వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ సేవలు ఉండవు.
BSNL
Data
Andhra Pradesh
Telangana

More Telugu News