Jana Sena: భవన నిర్మాణ కార్మికుల వెతలను జిల్లా కేంద్రాల్లో ఎలుగెత్తాలి: జనసేన సమరశంఖం
- నవంబరు 3న విశాఖలో లాంగ్ మార్చ్
- పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ర్యాలీ
- హైదరాబాద్ లో నేడు సన్నాహక సమావేశం
రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై జనసేన సమరశంఖం పూరించింది. ఉపాధి కోల్పోయిన కార్మికులకు మద్దతుగా నవంబరు 3న జనసేన విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కొనసాగనుంది. దీనికి సంబంధించిన కార్యాచరణను జనసేన పార్టీ విడుదల చేసింది. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను ప్రతి జిల్లా కేంద్రంలో ఎలుగెత్తాలని పేర్కొంది. ఈ నెల 30న కార్మికుల చేతులమీదుగా లాంగ్ మార్చ్ కు సంబంధించిన పోస్టర్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆవిష్కరించనున్నారు.
ఛలో విశాఖపట్నం కార్యక్రమ నిర్వహణ కోసం నేడు హైదరాబాద్ లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితిని జిల్లా కేంద్రాల్లో ఎలుగెత్తి చాటాలని సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో ఇసుక సంక్షోభం నెలకొందని, తత్ఫలితంగా లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది.