Chiranjeevi: 'లూసిఫర్' తెలుగు రీమేక్ గురించి స్పందించిన చరణ్

  • ఇంతవరకూ ఏమీ అనుకోలేదు 
  •  నాన్నగారు అడిగితే చేస్తాను
  • అది నిజమేనన్న చరణ్
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వం వహించే సినిమాకి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తాజాగా ఈ విషయంపై చరణ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నాకు తగిన పాత్ర వుంటే .. అది నేనే చేయాలని నాన్నగారు అంటే అప్పుడు చేస్తాను" అన్నాడు.

ఇక ఇదే సమయంలో ఆయన 'లూసిఫర్' రీమేక్ గురించిన క్లారిటీ కూడా ఇచ్చేశాడు. "మలయాళంలో మోహన్ లాల్ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగు రీమేక్ రైట్స్ ను నేను తీసుకున్న మాట నిజమే. అయితే ఈ సినిమాను ఎవరితో చేయాలి? దర్శకుడిగా ఎవరైతే కరెక్ట్? అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈ విషయాల్లో స్పష్టత వస్తే తప్పకుండా తెలియజేస్తాను" అని చెప్పాడు.
Chiranjeevi
Charan

More Telugu News