Narendra Modi: మోదీ విమానానికి అనుమతి నిరాకరణపై ఐసీఏవోకు ఫిర్యాదు చేయనున్న భారత్

షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానం తమ గగనతలంపై నుంచి వెళ్లేందుకు పాకిస్థాన్ మరోసారి అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లాల్సి ఉండగా పాక్ ఈ చర్యకు పాల్పడింది. దీనిపై భారత్ స్పందించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని భావిస్తోంది. పాకిస్థాన్ చేసిన ప్రకటన పట్ల చింతిస్తున్నామని, ఐసీఏవో నిబంధనలు ప్రతిదేశం పాటించాల్సి ఉంటుందని ఓ భారత అధికారి మీడియాకు తెలిపారు.

ఈ విషయంపై భారత్ ఇప్పటికి రెండుసార్లు సంయమనం పాటించిందని అన్నారు. ఇక తాము ఈ విషయంపై కచ్చితంగా ఐసీఏవోకు ఫిర్యాదు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. వ్యక్తిగత సాకులను చూపుతూ ఇష్టానుసారం నడుచుకుంటే ఐసీఏవో తగిన బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు. కాగా జమ్మూకశ్మీర్ లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని  పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Narendra Modi
Pakistan

More Telugu News