Bigg Boss: బిగ్ బాస్-3 గ్రాండ్ ఫినాలే ముఖ్య అతిథిగా చిరంజీవి?

  • అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పర్ఫార్మెన్స్?
  • త్వరలో గ్రాండ్ ఫినాలే
  • విజేతగా నిలిచే వారికి రూ.50 లక్షలు
తెలుగు బిగ్ బాస్ 3 చివరి దశకు చేరుకుంది. ఇటీవల బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, శివజ్యోతి ఎలిమినేషన్ కు నామినేట్ కాగా, వారిలో శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచారు. వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు.

అయితే, గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారని సమాచారం. బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు వరుణ్ సందేశ్, రాహుల్ కే అధికంగా ఉన్నాయని టాక్. ఈ సీజన్ విజేత ఎవరో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Bigg Boss
srimukhi
star maa

More Telugu News