Sanke: గుండె ఝల్లుమనే దృశ్యం... వంటింట్లో నాగుపాము!

  • ఒడిశాలోని బారిపదలో ఘటన
  • వంట చేసేందుకు వెళితే పడగ విప్పి ఆడుతున్న పాము
  • చాకచక్యంగా బంధించిన వాలంటీర్
పామును బయట చూస్తేనే భయమేస్తుంది. అదే తాచుపామో, నాగుపామో అయితే, మరింత భయపడతాం. ఇక అదే పాము ఇంట్లోకి దూరి, వంటింట్లో కూర్చుని పడగ విప్పితే... ఇంకేమైనా ఉందా? గుండె ఝల్లుమనడం ఖాయం. ఓడిశా పరిధిలోని మయూర్ భంజ్ జిల్లా బారిపదలో ఇదే ఘటన జరిగింది.

రోజు మాదిరిగానే వంట చేసేందుకు ఓ గృహిణి వంట గదిలోకి వెళ్లగా, పెద్ద నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ కనిపించింది. దీంతో తీవ్రంగా భయపడిన ఆమె, బయటకు వచ్చి చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. దీంతో వారు పాములను పట్టుకునే వాలంటీర్ కు సమాచారాన్ని అందించగా, అతను వచ్చి, నాగుపామును చాకచక్యంగా బంధించాడు. దీన్ని సమీపంలోని అడవుల్లో వదిలేయనున్నట్టు తెలిపారు.
Sanke
Kitchen
Odisha

More Telugu News