manchu vishanu: చిరంజీవి చేతికి తన చిన్న కుమార్తెను అందించి.. ఆశీర్వదించమని కోరిన మంచు విష్ణు

  • నిన్న తన నివాసంలో చిత్ర పరిశ్రమ ప్రముఖులకు విందు
  • చిన్న కుమార్తె ఐరా విద్యను చిరుకు పరిచయం చేసిన విష్ణు దంపతులు
  • ఈ ఏడాది ఆగస్టులో ఐరా విద్య జననం
దీపావళి సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు నటుడు మంచు విష్ణు శంషాబాద్‌లోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశాడు. చిరంజీవి, ప్రభాస్ సహా పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణు, విరానికా దంపతులు తమ చిన్న కుమార్తె ఐరా విద్యను చిరంజీవికి పరిచయం చేశారు. చిరు చేతికి తమ కుమార్తెను అందించి ఆశీర్వదించమని కోరారు. చిరంజీవి తమ కుమార్తెను ఎత్తుకున్న ఫొటోలను విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.

‘కూలెస్ట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి అంకుల్‌కి ఐరా విద్యను పరిచయం చేశాను’ అని క్యాప్షన్ తగిలించాడు. కాగా, విష్ణు, విరానికా దంపతులకు నలుగురు సంతానం. వీరికి డిసెంబరు 2011లో అరియానా, వివియానా అనే ఇద్దరు కవల అమ్మాయిలు జన్మించారు. 2018లో అవిరామ్‌భక్త అనే అబ్బాయి జన్మించగా, ఈ ఏడాది ఆగస్టులో ఐరా విద్య జన్మించింది.
manchu vishanu
Chiranjeevi
Ira vidya
party

More Telugu News