kunamneni sambasivarao: కూనంనేని దీక్ష భగ్నం.. అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని నిమ్స్‌కు తరలింపు

  • మూడు రోజుల క్రితం మగ్దూంభవన్‌లో దీక్ష ప్రారంభం
  • నిన్న అర్ధరాత్రి కూనంనేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆసుపత్రిలోనూ కొనసాగుతున్న దీక్ష
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజులుగా సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు హైదరాబాదులో చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిన్న అర్ధరాత్రి మగ్దూం భవన్‌కు చేరుకున్న పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ కూడా కూనంనేని తన దీక్షను కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 24వ రోజుకు చేరుకుంది. జేఏసీ పిలుపుతో నేడు కార్మికులు కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నారు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
kunamneni sambasivarao
cpi
tsrtc

More Telugu News