Chandrababu: రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదు, వ్యక్తిగతంగా అండగా ఉంటా: వంశీకి లేఖ రాసిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడంపై చంద్రబాబునాయుడు స్పందించారు. రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదని హితవు పలికారు. ఈ మేరకు వంశీకి చంద్రబాబు లేఖ రాశారు. సమస్యలకు ఎదురు నిలిచి పోరాడాలని సూచించారు. వైసీపీపై పోరాటంలో అండగా ఉంటామని వంశీకి ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు చేద్దామని సూచించారు.
Go Back to Shorts
Chandrababu
Vallabhaneni Vamsi
Telugudesam
Andhra Pradesh

More Telugu News