Kyarr: భారత్ కు తప్పిన 'క్యార్' ముప్పు!

  • పెను తుపానుగా బలపడిన క్యార్
  • ఒమన్ వైపు పయనం
  • పశ్చిమ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న క్యార్ తుపాను మరింత భీకర రూపు దాల్చింది. ఇది మరింత బలపడి ఈ ఉదయం పెను తుపానుగా మారినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. గంటకు 230 నుంచి 240 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో క్యార్ అరేబియా సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కాగా, ప్రస్తుతం భారత పశ్చిమ తీరానికి సమీపంగా ఉన్న క్యార్ ఒమన్ దిశగా వెళుతుందని ఐఎండీ వెల్లడించింది. దాంతో గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు ముప్పు తప్పింది. అయితే, క్యార్ తుపాను కారణంగా గోవా, కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పెను తుపాను ముంబయికి నైరుతి దిశలో 620 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. 2007 తర్వాత అరేబియా సముద్రంలో ఓ సూపర్ సైక్లోన్ ఏర్పడడం ఇదే ప్రథమం.
Kyarr
Super Cyclone
India
Arabian Sea

More Telugu News