Manchu Manoj: మంచు మనోజ్ కీలక నిర్ణయం... దీపావళి సందర్భంగా వెల్లడి

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ తన సినీ జీవితాన్ని సరికొత్తగా పునఃప్రారంభిస్తున్నారు. కొంతకాలంగా వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న మంచు మనోజ్ కు ఇటీవలే విడాకులు మంజూరయ్యాయి. దాంతో రిలీఫ్ గా ఫీలైన మనోజ్ సినిమా రంగంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటానని అభిమానులకు తెలిపాడు. అయితే ఈసారి నిర్మాతగా మారేందుకు ఆసక్తి చూపించాడు. దీపావళి సందర్భంగా తన పేరు కలిసొచ్చేలా ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ స్థాపించాడు. తన సొంత బ్యానర్ లో కొత్త ప్రతిభను పరిచయం చేస్తానని తెలిపాడు. మున్ముందు మహత్తరమైన సినిమాలు తన బ్యానర్ నుంచి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశాడు.
Go Back to Shorts
Manchu Manoj
MM Arts
Tollywood

More Telugu News