Train Accident: మెరుపు వేగంతో స్పందించి.. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బంది

  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • కదులుతోన్న రైలును ఎక్కబోయిన ప్రయాణికుడు
  • ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడబోయిన వైనం
మెరుపు వేగంతో స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది ఒకరు.. ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. కోయంబత్తూరు రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు కదులుతోన్న రైలును ఎక్కడానికి ప్రయత్నించాడు. ఇదే క్రమంలో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడబోయాడు.

ఈ విషయాన్ని గుర్తించిన అక్కడున్న ఆర్పీఎఫ్ సిబ్బంది... ఆ ప్రయాణికుడిని వెంటనే కోచ్ లోకి నెట్టేశాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. సమయానికి ఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడలేకపోయి ఉంటే ప్లాట్ ఫాం, రైలుకి మధ్య ఉన్న సందులో అతడు పడి ప్రాణాలు కోల్పోయేవాడు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Train Accident
coimbatore
Viral Videos

More Telugu News