Ramcharan: మోదీకి ఉపాసన చేసిన ట్వీట్ పై స్పందించిన రామ్ చరణ్!

  • గత వారంలో ట్వీట్ చేసిన ఉపాసన
  • తనకు తెలియకుండా చేసిందన్న రామ్ చరణ్
  • ఆ ట్వీట్ గౌరవ పూర్వకమేనని వ్యాఖ్య
గత వారంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాది నటీ నటులను మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించి, విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఉపాసన ట్వీట్ చేస్తూ, దక్షిణాదిని కూడా గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు.

తాజాగా దీనిపై స్పందించిన రామ్ చరణ్, ఉపాసన ట్వీట్ చేసిన సంగతి తనకు ఆలస్యంగా తెలిసిందని చెప్పాడు. ఉపాసన చాలా గౌరవ పూర్వకంగానే తన ఆవేదనను వ్యక్తం చేసిందని, ఆపై ఖుష్బూ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని చెప్పాడు. ట్వీట్ పై ఉపాసనను తాను ప్రశ్నించానని, మోదీకి ట్వీట్ చేస్తున్నట్టు చెబితే వద్దంటావన్న ఆలోచనతో చెప్పకుండా చేశానని అందని అన్నాడు. వాస్తవానికి ఇటువంటి విషయాలపై మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాట్లాడితే బాగుండేదని రామ్ చరణ్ అభిప్రాయపడ్డాడు.
Ramcharan
Upasana
Twitter
Narendra Modi

More Telugu News