New Delhi: కాకరపూలు, చిచ్చుబుడ్లు మాత్రమే... ఢిల్లీ వాసులపై ఆంక్షలు!

  • ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ తయారు చేసిన ప్రభుత్వం
  • అవి మాత్రమే కాల్చాలని ఆదేశాలు
  • కాలుష్యాన్ని తగ్గించేందుకేనన్న అధికారులు
దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండగ వేళ, ప్రభుత్వం తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం కాకరపూలు, చిచ్చుబుడ్లను తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ ప్యాకెట్లకై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. వాతావరణం కాలుషితం కాకుండా తక్కువ కాలుష్యాలను వెదజల్లే ఇవి మాత్రమే ఢిల్లీలో ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రతి సంవత్సరమూ ఈ సీజన్ లో ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక దీపావళి నాడు వెలువడే కాలుష్యాలు వేలమందిని మృత్తువు దగ్గరికి చేరుస్తున్నాయి. వీటికి చెక్ పెట్టాలని గత కొన్నేళ్లుగా ఢిల్లీ సర్కారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఎకో ఫ్రెండ్లీ టపాకాయలను తయారు చేయించినట్టు అధికారులు వెల్లడించారు. ఇక భవంతులను అలంకరించేందుకు ఎలక్ట్రిక్ దీపాలకు బదులు బయో డీగ్రేడబుల్ దీపాలను వెలిగించాలని అధికారులు సూచిస్తున్నారు.
New Delhi
Fire Crakers
Flower Pots
Crakers

More Telugu News