Vijayawada: విజయవాడకు తొలిసారి ఎయిర్ బస్... దీపావళి కానుకగా నాలుగు కొత్త సర్వీసులు!

  • 180 సీట్ల సామర్థ్యముండే ఎయిర్ బస్
  • విజయవాడ - తిరుపతి మధ్య ప్రయాణం
  • హైదరాబాద్ కు మరో రెండు సర్వీసులు
విజయవాడ విమానాశ్రయం నుంచి నేడు నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ కు రెండు, విశాఖ, తిరుపతి నగరాలకు ఒక్కోటి చొప్పున సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో తొలిసారిగా రెండు నగరాల మధ్య ఎయిర్ బస్ విమానం నడవబోతోంది. 180 సీట్ల సామర్థ్యముండే ఈ విమానం విజయవాడ - తిరుపతి మధ్య ప్రయాణించనుంది. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, తక్కువ సీట్లు ఉండే విమానాల స్థానంలో ఎక్కువ సీట్లుండే ఎయిర్ బస్ ను ప్రవేశపెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. విజయవాడ - హైదరాబాద్ మధ్య కొత్తగా స్పైస్ జెట్, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా, విశాఖపట్నం - విజయవాడ మధ్య స్పైస్ జెట్ తన సర్వీస్ ను పునరుద్ధరిస్తోంది.
Vijayawada
Hyderabad
Tirupati
Vizag
Airport
Airbus

More Telugu News