Andhra Pradesh: ఏపీ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య సిబ్బందికి దీపావళి కానుక

  • నెలకు రూ.16 వేల వేతనం
  • జీవో విడుదల
  • 2020 జనవరి నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు పెంచింది. ఈ పెంచిన వేతనాలను వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
Andhra Pradesh
YSRCP
Jagan

More Telugu News