ప్రఖ్యాత వైద్యురాలు పోలవరపు తులసీదేవి దశదిన కర్మకు హాజరైన బాలకృష్ణ
- ఇటీవల గుండెపోటుతో మరణించిన తులసీదేవి
- స్వగ్రామంలో దశదిన కర్మ
- నివాళులు అర్పించిన బాలయ్య
ఈ కార్యక్రమానికి బసవతారకం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. బసవతారకం ఆసుపత్రి స్థాపన, ఆ తర్వాత కూడా తులసీదేవి అనేక విధాలా సేవలు అందించారని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.