Jagan: అత్యాచార ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: డీజీపీకి ఏపీ సీఎం జగన్ ఆదేశం

  • పెదగార్లపాడులో బాలికపై అత్యాచారయత్నంపై సీరియస్
  • ఇలాంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతాయి
  • పునరావృతం కాకుండా చూసే బాధ్యత పోలీసులదే
రాష్ట్రంలో అత్యచార ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో బాలికపై అత్యచారయత్నం జరిగిన ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తాయని, పునారావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆయన డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
Jagan
DGP
Andhra Pradesh

More Telugu News