Jammu And Kashmir: జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు కొత్త గవర్నర్లు వచ్చేశారు!

  • జమ్మూ కశ్మీర్‌కు గిరీశ్‌చంద్ర ముర్ము
  • లడఖ్‌కు రాధాకృష్ణ మాధుర్‌ల నియామకం
  • సత్యపాల్ మాలిక్‌ను గోవాకు పంపిన కేంద్రం
జమ్మూకశ్మీరు, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లు వచ్చేశారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్‌ను గోవాకు బదిలీ చేసిన కేంద్రం.. జమ్మూకశ్మీర్‌కు గరీశ్‌చంద్ర ముర్ము, లడఖ్‌కు రాధాకృష్ణ మాధుర్‌లను నియమించింది. ఈ మేరకు నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర వ్యయ విభాగ కార్యదర్శిగా ఉన్న గిరీశ్‌చంద్ర వచ్చే నెలలో రిటైర్ కానున్నారు. ఆయన గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఇక, రాధాకృష్ణ మాధుర్  త్రిపుర కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. గతంలో రక్షణశాఖ కార్యదర్శిగా, ముఖ్య సమాచార కమిషనర్‌గా పనిచేశారు. బీజేపీ కేరళ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు.
Jammu And Kashmir
ladakh
governor
girish chandra murmu

More Telugu News