Lb nagar: పసికందు మృతి ఘటన.. షైన్ ఆసుపత్రి ఎండీ అరెస్టు!

  • ఈ నెల 21న ఎల్బీనగర్ లోని ‘షైన్’ లో అగ్ని ప్రమాదం
  • సునీల్ సహా మరో నలుగురిపై కేసు నమోదు
  • రిమాండ్ లోకి తీసుకున్న పోలీసులు
ఈ నెల 21న ఎల్బీనగర్ లోని షైన్ ఆసుపత్రిలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో నాలుగు నెలల పసికందు మృతి చెందడంతో పాటు మరో నలుగురు శిశువులు గాయపడటం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన కేసులో ఆసుపత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ కుమార్ ను అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో ఉంచారు. సునీల్ కుమార్ ను కోర్టులో ప్రవేశపెట్టిన ఎల్బీనగర్ పోలీసులు, న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన్ని రిమాండ్ లోకి తీసుకున్నారు.
Lb nagar
shine Hospital
Md
Sunilkumar reddy

More Telugu News