Tridandi: చినజీయర్ స్వామి సమక్షంలో.. ‘ఆదర్శ దిన చర్య 2020’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి

షార్ట్స్‌లో చూడండి
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కలిశారు. గుంటూరు జిల్లా సీతానగరంలోని చిన జీయర్ స్వామి ఆశ్రమానికి ఈరోజు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా వెల్లంపల్లిని మంగళాశాసనంతో ఆశీర్వదించి సన్మానించారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు అందించాల్సిన సౌకర్యాలు, సేవలపై మంత్రికి ఆయన పలు సూచనలు చేశారు. ఈ సూచనలు తక్షణమే అమలు చేస్తామని వెల్లంపల్లి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ఆదర్శ దిన చర్య 2020’ పుస్తకమును స్వామి వారి సమక్షంలో వెల్లంపల్లి ఆవిష్కరించారు.
Go Back to Shorts
Tridandi
china Jiyer
Minister
Vellampally

More Telugu News