Yanamala: హైకోర్టు వ్యాఖ్యలకు వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలి: యనమల

  • హైకోర్టు వద్ద కప్పు టీ కూడా దొరకడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది
  • అమిత్ షా, జగన్ మధ్య చర్చలు జరగలేదని బీజేపీ నేతలే చెప్పారు
  • అవినీతిలో మునిగిన వ్యక్తి యువతకు దిశానిర్దేశం ఏం చేస్తారు?
అమరావతిలో అభివృద్ధి పనులను నిలిపివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టిందని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. హైకోర్టు వద్ద లాయర్లకు కనీసం కప్పు టీ కూడా దొరకడం లేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ అసమర్థ పాలనకు హైకోర్టు వ్యాఖ్యలు నిదర్శనమని అన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ముఖ్యమంత్రి జగన్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని బీజేపీ నేతలే చెప్పారని...  కానీ, ఇద్దరి మధ్య 45 నిమిషాల చర్చలు జరిగాయని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని యనమల ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం పేరుతో చేస్తున్న ప్రకటనల్లో ఉన్న డొల్లతనం దీంతో తెలిసిపోతోందని అన్నారు. యువత సరైన బాటలో నడవాలంటూ జగన్ పిలుపునిస్తున్నారని... నిండా అవినీతిలో మునిగిన వ్యక్తి యువతకు దిశానిర్దేశం ఏం చేస్తారని ప్రశ్నించారు.
Yanamala
jagan
Amit Shah
BJP
Telugudesam
YSRCP
High Court

More Telugu News