Cheddy Gand: ఇంట్లో వారిని కట్టేసి.. దోచుకున్న చెడ్డీ గ్యాంగ్!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదులో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయింది. హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరు గ్రామ శివారులో ఉన్న ఓ వైదిక సేవా కేంద్రంలోకి నిన్న అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న భార్యాభర్తలతో పాటు కుమారుడిని తాళ్లతో కట్టేసి... 11 తులాల బంగారంతో పాటు రూ. 50 వేలు ఎత్తుకెళ్లారు. అంతేకాదు, పక్కనే తాళం వేసిన ఉన్న మరో ఇంట్లో కూడా చోరీ చేశారు. ఆ ఇంట్లోని వారు ఓ బర్త్ డే పార్టీకి వెళ్లారు. పార్టీ ముగించుకుని ఇంటికి వచ్చిన వారికి షాక్ తగిలింది. మొత్తం ఆరుగురు దొంగలు ఇనుపరాడ్లు పట్టుకొచ్చి ఈ దొంగతనాలకు పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ చోరీలపై పోలీసులు కేసు నమోదు చేసి, దొంగల కోసం గాలింపు మొదలుపెట్టారు.
Go Back to Shorts
Cheddy Gand
Hyderabad

More Telugu News