dharanikota: జనసేనకు ధరణికోట వెంకటరమణ రాజీనామా.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న జియోలజిస్ట్!

  • గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ
  • కన్నా సమక్షంలో బీజేపీ కండువా
  • జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమన్న ధరణికోట
జనసేన నుంచి మరో వికెట్ పడింది. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన జియోలజిస్ట్ ధరణికోట వెంకటరమణ నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ధరణికోట మాట్లాడుతూ.. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. నిర్మాణాత్మకంగా బలంగా లేని పార్టీలో ఎన్నో గొప్ప సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ప్రజలకు న్యాయం చేయలేమనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరినట్టు చెప్పారు.
dharanikota
Jana Sena
BJP
Andhra Pradesh

More Telugu News