Byreddy Rajasekhar Reddy: బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించిన బైరెడ్డి

  • కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నా
  • ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
  • అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది
త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రకటించారు. కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయం మేరకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం చంద్రబాబు వల్లే రాష్ట్రం విడిపోయిందని చెప్పారు. కొత్త రాష్ట్రం ఏపీపై ప్రధాని మోదీకి సానుభూతి ఉందని అన్నారు. హైకోర్టు, రాజధాని ఏర్పాటు విషయంలో ప్రాంతాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందని చెప్పారు. అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. జీతాలు రావనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారని చెప్పారు.
Byreddy Rajasekhar Reddy
BJP
Jagan
Chandrababu

More Telugu News