Huzurnagar: కాంగ్రెస్ కంచుకోటలో టీఆర్ఎస్ జెండా.. హుజూర్ నగర్ ఉపఎన్నికలో సైదిరెడ్డి ఘనవిజయం

  • హుజూర్ నగర్ లో తొలిసారిగా గులాబీ జెండా రెపరెపలు
  • టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో గెలుపు
  • 2009లో ఉత్తమ్ రికార్డును బ్రేక్ చేసిన సైదిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరింది. హుజూర్ నగర్ లో తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. సైదిరెడ్డి 43 వేల పైచిలుకు మెజార్టీ సాధించారు. 15వ రౌండ్ ముగిసేసరికే 2009 నాటి ఉత్తమ్ రికార్డును సైదిరెడ్డి బ్రేక్ చేశారు. కాగా, హుజూర్ నగర్ లో ఇప్పటి వరకు ఏడు సార్లు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ 29,194. ఏ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయినట్టు సమాచారం. బీజేపీ, టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
Huzurnagar
TRS
By-election
sanampudi saidireddy

More Telugu News