manda krishnamadiga: హరీశ్...మీరు మామ పక్షమా? కార్మిక పక్షమా? : తేల్చిచెప్పాలన్న మంద కృష్ణ

  • మీకు పదవి రానప్పుడు తెలంగాణ మీవెంటే నిలిచింది
  • మంత్రికాగానే అన్నీ మర్చిపోయినట్టున్నారు
  • సమ్మె సమస్యపై పట్టనట్టు వ్యవహరిస్తున్నారు
కేసీఆర్‌ మీకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు తెలంగాణ మొత్తం మీవెన్నంటి నిలిచిందని, తీరా మంత్రి పదవి రాగానే ఆ తెలంగాణ ప్రజల్లో భాగమైన ఆర్టీసీ కార్మికులను గాలికి వదిలేశారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాష్ట్ర మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి విమర్శించారు.

ప్రతి విషయంలో స్పందించే మీరు ప్రజల మనిషి అని జనం నమ్ముతున్నారని, అటువంటి మీరు కార్మిక వర్గం విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మీరు మీ మామ కేసీఆర్‌ పక్షమా? లేక కార్మికుల పక్షమా? తేల్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇరవై రోజులుగా కార్మికులు తమ న్యాయమైన కోర్కెల సాధనకు పోరాడుతుంటే, సీఎం కేసీఆర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.
manda krishnamadiga
Harish Rao
TSRTC
KCR

More Telugu News