Bithiri Sathi: డబ్బు డిమాండ్ చేసి ఆ ఛానల్ నుంచి నేను బయటికి రాలేదు: బిత్తిరి సత్తి

  • నన్ను లైట్ తీసుకుంటున్నట్టు అనిపించింది 
  • డబ్బు గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు 
  • తనలో అహంభావం పెరగలేదన్న సత్తి
తాజాగా 'బిత్తిరి సత్తి' ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "నాకు మంచి పేరు ప్రతిష్ఠలు రావడానికి కారణమైన న్యూస్ ఛానల్ ను వదిలేసి బయటికి రావలసి వచ్చింది. నేను డబ్బు ఎక్కువగా డిమాండ్ చేస్తే వాళ్లు ఒప్పుకోకపోవడం వలన బయటికి వచ్చేసినట్టుగా అనుకుంటున్నారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు.

అక్కడ అంతకుముందున్న ఆదరణ తగ్గుతూ వచ్చింది .. నన్ను లైట్ తీసుకుంటున్నారేమో అనిపించింది. కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే వాళ్ల ఉద్దేశం అందుకు కారణం కావొచ్చు. నా స్థానంలో మరొకరు వచ్చే చివరి నిమిషం వరకూ వుండి అప్పటికప్పుడు బయటికి రాలేను. ఇక అహంభావంతో నేను బయటికి వచ్చేశాననే మాటలో కూడా నిజం లేదు. బయటికెళ్లి ఇంకా కొత్తగా ఏదైనా చేద్దాం అనే నాలోని బలమైన ఆలోచనే అందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చునేమో" అని అన్నాడు.
Bithiri Sathi

More Telugu News