bandla ganesh: చెక్‌బౌన్స్‌ కేసులో బండ్ల గణేశ్ ను కడప కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

  • మోసం కేసులో అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు
  • అనంతరం కడప తరలింపు
  • వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ను ఈరోజు ఉదయం పోలీసులు కడప కోర్టులో హాజరు పరిచారు. తనవద్ద అప్పు తీసుకుని, బదులుగా ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ కావడంతో మోసపోయానంటూ కడపకు చెందిన మహేష్‌ అనే వ్యాపారి పెట్టిన కేసులో ఆయన హాజరయ్యారు.  

దీనిపై కోర్టు అరెస్టు వారెంటు జారీ చేయడంతో నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కడప కోర్టులో హాజరు పరిచారు. కాగా, ఈనెల ఐదవ తేదీన బండ్ల గణేశ్ తన అనుచరులతో కలసి తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశాడని విజయవాడకు చెందిన వైసీపీ నేత పీవీపీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా వరుస కేసులతో గణేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
bandla ganesh
cuddapha court
chque bounce case

More Telugu News