Chandrababu: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్.. చంద్రబాబు స్కెచ్: విజయసాయిరెడ్డి

  • టీడీపీని బీజేపీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారు
  • బీజేపీ జెండా మోస్తున్నవారిని ఎదగనివ్వలేదు
  • తెలంగాణ కాంగ్రెస్ లోకి నమ్మకస్తులను పంపించారు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను టీడీపీ అధినేత చంద్రబాబు పంపించారని... తద్వారా ఆ పార్టీని తన కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఏపీలో తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా స్కెచ్ వేశారని తెలిపారు. అందుకే, ముందు నుంచి బీజేపీ జెండా మోస్తున్నవారిని ఎదగనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు.
Chandrababu
Nara Lokesh
Vijayasai Reddy
Telugudesam
YSRCP
BJP

More Telugu News