Saidireddy: హుజూర్ నగర్ ఎన్నిక కౌంటింగ్... ఆధిక్యంలో సైదిరెడ్డి!

  • టీఆర్ఎస్ తరఫున బరిలో సైదిరెడ్డి
  • తొలి రౌండ్ లో 2,476 ఓట్ల ఆధిక్యం
  • మధ్యాహ్నానికే తుది ఫలితం
తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. తొలి రౌండ్ కౌంటింగ్ అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సైదిరెడ్డి 2,476 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

 గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి విజయం సాధించిన ఉత్తమ్, ఆపై నల్గొండ లోక్ సభకు పోటీ చేసి గెలుపొందడంతో, హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. కాగా, మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ సాగనుండగా, మధ్యాహ్నం ఒంటిగంట లోపే తుది ఫలితం వెలువడుతుందని అధికారులు అంటున్నారు.
Saidireddy
Huzur Nagar
Nalgonda
Telangana

More Telugu News