Tirupati: తిరుపతిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధం.. నేటి నుంచే అమలు

  • బ్యానర్లు కడితే జరిమానా
  • నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • ఆదేశాలు జారీ చేసిన కమిషనర్
తిరుపతిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడాన్ని నిషేధిస్తూ నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. నిన్న టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమైన అనంతరం కమిషనర్ గిరీశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిషేధం నేటి నుంచే అమల్లోకి రానుంది. అలాగే, ఇప్పటికే కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. అనుమతి లేకుండా కట్టిన వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
Tirupati
Chittoor District
Andhra Pradesh

More Telugu News