DK Shivakumar: డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరు

  • బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
  • మనీలాండరింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న డీకే
  • బెయిల్ లభించడంతో సంతోషంలో కాంగ్రెస్ శ్రేణులు
కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే సందర్భంగా డీకేకు షరతులను విధించింది. దేశాన్ని విడిచి వెళ్లకూడదని కండిషన్ పెట్టింది. మనీ లాండరింగ్ కేసులో శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పన్నులను ఎగ్గొట్టారని, కోట్లాది రూపాయల లావాదేవీలను అక్రమంగా నిర్వహించారని ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు, శివకుమార్ కు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు.
DK Shivakumar
Bail
Supreme Court
Congress

More Telugu News