NTR: కీరవాణి తనయుల పరిచయంతో 'మత్తు వదలరా'.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ఎన్టీఆర్!

  • హీరోగా పరిచయం అవుతున్న సింహ
  • టీమ్ కు ఎన్టీఆర్ శుభాకాంక్షలు
  • ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసిన ఎన్టీఆర్
సంగీత దర్శకుడు కీరవాణి చిన్నకొడుకు సింహ హీరోగా, పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్ లుక్ ను జూనియర్ ఎన్టీఆర్ ఈ ఉదయం తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. "సమయం గడిచిపోతోంది. నా సోదరులంతా పెరిగిపెద్దయ్యారు. సింహా కోడూరి హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్ లుక్ ను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. తొలి చిత్రాలతోనే వీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర టీమ్ కు శుభాకాంక్షలు" అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
NTR
Mattu Vadalara
First Look

More Telugu News